Home » SCIENCE & TECH » 2020 నాటికి 3వ అతి పెద్ద పౌర విమాన‌యాన విప‌ణిగా భార‌త్‌

2020 నాటికి 3వ అతి పెద్ద పౌర విమాన‌యాన విప‌ణిగా భార‌త్‌

దేశంలో పౌర విమాన‌యాన విప‌ణివేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ పౌర విమాన‌యాన రంగంలో మ‌నం 9వ స్థానంలోఉన్నామ‌ని, 2020 నాటికి మ‌న దేశం3వ అతి పెద్ద పౌరవిమాన‌యాన విప‌ణిగా భార‌త్ ఎదిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో 5వ‘ఇండియా ఏవియేష‌న్– 2016’ ను రాష్ట్రప‌తిలాంఛ‌నంగా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నప్ర‌సంగిస్తూ భార‌త విమానాశ్ర‌యాలు 2015లో 190 మిలియ‌న్ ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాయ‌నిగుర్తు చేశారు. పౌర విమాన‌యాన రంగంలో భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ప్ప‌టికీటైర్ – 2, టైర్ – 3 న‌గ‌రాల‌కువిమాన సేవ‌లు అంద‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొన్ని న‌గ‌రాలు జాతీయ గ్రిడ్‌తో స‌రిగా అనుసంధానంకాలేద‌ని గుర్తు చేశారు. ఈశాన్యరాష్ట్రాల్లో స‌రైన వైమానిక అనుసంధానం జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. 2020 నాటికి భార‌త్‌కు 800 విమానాలు అవ‌స‌ర‌మ‌వుతాయ‌నిపేర్కొన్నారు.

అలాగే, విమాన‌యాన రంగంలోమౌలిక స‌దుపాయాల‌ను మ‌రింత‌గా పెంచ‌డం, నూత‌న విమానాశ్ర‌యాల‌ను ఏర్పాటుచేయ‌డం, ఉన్న విమానాశ్ర‌యాల్లోస్థాయిని పెంచ‌డం అత్య‌వ‌స‌రమ‌న్నారు. పౌర విమాన‌యాన రంగానికి ఉన్న ప్రాధాన్యం నేప‌థ్యంలో ‘ఇండియా ఏవియేష‌న్– 2016’ ఈ రంగంలోని భాగ‌స్వాముల‌కు, అంత‌ర్జాతీయవాణిజ్య వేత్త‌ల‌కు మంచి వేదిక‌గానిలుస్తుంద‌ని చెప్పారు. వారంద‌రికీ సువ‌ర్ణావ‌కాశాల‌నుక‌ల్పిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ కార్య‌క్ర‌మం వైమానిక రంగంలోమౌలిక వ‌స‌తులు క‌ల్పించే ఆప‌రేట‌ర్ల‌ను, డెవ‌ల‌ప‌ర్ల‌ను, విమాన‌యాన సంస్థ‌ల‌ను, ఏజెన్సీల‌ను, ఇత‌ర‌త్రా సంస్థ‌ల‌నుఒక్క‌చోటికి చేర్చింద‌ని తెలిపారు. 25 దేశాల నుంచి 200 మందికి పైగా ప్ర‌తినిధులుహాజ‌రుకావ‌డం సంతోషించద‌గిన విష‌య‌మ‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన మేకిన్ ఇండియా, స్టాండ‌ప్ ఇండియా, స్టార్ట‌ప్ఇండియాలకు ఈ కార్యక్రమం ఉత్ప్రేర‌కంగా నిలుస్తుంద‌ని రాష్ట్రప‌తి అన్నారు. భార‌త పౌర విమాన‌యాన రంగంలో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాల‌నునెల‌కొల్పేందుకు ఇది దోహ‌ద‌ప‌డాల‌నిఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*