Home » LIFE STYLE » 19 మార్చి 2016న ప్రారంభం కానున్న ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్; పార్శీ – జొరాస్ట్రియ‌న్ సాంస్కృతిక ఉత్స‌వాలు

19 మార్చి 2016న ప్రారంభం కానున్న ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్; పార్శీ – జొరాస్ట్రియ‌న్ సాంస్కృతిక ఉత్స‌వాలు

అల్ప సంఖ్యాక వ‌ర్గ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ 2016, మార్చి 19 నుంచి మే 29 మ‌ధ్య న‌గ‌రంలోని ప్ర‌ధాన సాంస్కృతిక కేంద్రాల‌లో “ద ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రోగ్రామ్”పేరిట ఒక సాంస్కృతిక వినోద ఉత్స‌వాన్ని నిర్వ‌హించ‌నుంది.

హ‌మారీ ధ‌రోహ‌ర్ అనే ఇతివృత్తంతో సంస్కృతి మంత్రిత్వ శాఖ, పార్జోర్ ఫౌండేష‌న్ ల స‌మన్వ‌యంతో ఈ ఉత్స‌వం జ‌రుగ‌నుంది. 2016 మార్చి 19న ఆరంభ‌మ‌య్యే ఈ కార్య‌క్ర‌మం చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉన్న పార్శీ వ‌ర్గాల చ‌రిత్ర‌, విశ్వాసాలు, అల‌వాట్ల విశిష్ట‌త‌కు అద్దం ప‌డుతుంది. దాదాపు 2 నెల‌ల‌కు పైగా అనేక సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఈ ఉత్స‌వంలో భాగంగా చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌పంచ సంస్కృతి, త‌త్వ ద‌ర్శ‌నం, క‌ళ‌ల‌కు పార్శీలు, జొరాస్ట్రియ‌న్ లు అందించిన సేవ‌ల సారాంశాన్ని ఈ ఉత్స‌వం క‌ళ్ళ‌కు క‌ట్ట‌నుంది.

ఈ ఉత్స‌వంలో 3 ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఏర్పాటు చేస్తారు. అవి : నేష‌న‌ల్ మ్యూజియమ్ లో “ద ఎవ‌ర్ లాస్టింగ్ ఫ్లేమ్ : జొరాస్ట్రియ‌న్ ఇన్ హిస్ట‌రీ అండ్ ఇమేజినేష‌న్”,ఇందిరా గాంధీ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ద ఆర్ట్స్ (ఐజి ఎన్ సీ ఏ) లో “త్రెడ్స్ ఆఫ్ కంటిన్యుటీ :జొరాస్ట్రియ‌న్ లైఫ్ అండ్ క‌ల్చ‌ర్” ద నేష‌న‌ల్ గ్యాల‌రీ ఆఫ్ మోడ్ర‌న్ ఆర్ట్ లో : “పేయింటెడ్ ఎన్‌కౌంట‌ర్స్ : పార్శీ ట్రేడ‌ర్స్ అండ్ ద క‌మ్యూనిటీ” ల‌ను నిర్వ‌హిస్తారు. వీటిలో భాగంగా ప‌లు సాంస్కృతిక, విద్యా కార్య‌క్ర‌మాలు కూడా ఉంటాయి.

జొరాస్ట్రియనిజ‌మ్ అనేది ప్ర‌పంచంలోనే అతి ప్రాచీన మ‌తాల‌లో ఒక‌టి. మ‌ధ్య ఆసియాలోని ఇరాన్ తెగ‌ల మ‌ధ్య ఇది అవ‌త‌రించింది. ఇస్లామ్ ఆవిర్భ‌వించే వ‌ర‌కు ఇది ప్ర‌ధాన మతంగా కొన‌సాగింది.

సృష్టిక‌ర్త ఒకే ఒక్క‌రైన అహూరా మ‌జ్దా, ఆయ‌న దూత జ‌రా తుష్ట్రా (జొరాస్ట‌ర్‌) ల‌పై న‌మ్మిక,మంచి, చెడుల వ్య‌త్యాసం ఈ మ‌తానికి కేంద్ర బిందువులుగా ఉన్నాయి.

ఇరాన్ తీర ప్రాంతాల నుంచి జొరాస్ట్రియ‌న్లు భార‌త దేశ ప‌శ్చిమ కోస్తా తీరానికి ప‌య‌నించి భార‌త్‌లో స్థిర ప‌డ్డారు. అక్క‌డ వారు పార్శీలుగా పేరు పొందారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న భార‌త దేశంలో ఒక వ‌ల‌స వాద వ‌ర్గంగా వారి ఎదుగుద‌లను వివ‌రిస్తుంది. ఈ వివ‌ర‌ణ 10 విభాగాలుగా ఉంటుంది.

సిస‌లైన ప‌ర్షియా మాతృ దేశానికి ఆవ‌ల నేడు భార‌త దేశంలోని పార్శీలు అతి పెద్ద జొరాస్ట్రియ‌న్ వ‌ర్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*