Home » BUSINESS » బీమా & పింఛ‌న్లు, అసెట్ రీ క‌న‌స్ట్ర‌క్ష‌ న్ కంపెనీలు, స్టాక్ ఎక్చేంజీల రంగాల‌లో FDI మార్పులు

బీమా & పింఛ‌న్లు, అసెట్ రీ క‌న‌స్ట్ర‌క్ష‌ న్ కంపెనీలు, స్టాక్ ఎక్చేంజీల రంగాల‌లో FDI మార్పులు

భార‌త దేశంలో ఉత్ప‌త్తి చేసిన‌, త‌యారు చేసిన ఆహార ఉత్ప‌త్తుల విక్ర‌యంలో ఎఫ్ ఐ పీ బీ మార్గం గుండా వంద శాతం ఎఫ్ డీ ఐ కి అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2016 -17 సాధార‌ణ బ‌డ్జెట్ ను ఈరోజు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతూ.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుల‌లో ప్రైవేటు ప్రాతినిధ్యాన్ని ప్రోత్స‌హించ‌డానికి ప‌బ్లిక్ యుటిలిటీ (రిజొల్యూష‌న్ ఆఫ్ డిస్ ప్యూట్స్‌) బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌న్నారు. అంతేకాకుండా పీపీపీ ఒప్పందాల పున‌ర్ నిర్దేశానికి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా -పార‌ద‌ర్శ‌క‌త్వానికి ఏ లోటు చేయ‌కుండా – జారీ చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుల‌కు ఒక కొత్త క్రెడిట్ రేటింగ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌స్తామ‌న్నారు. ఎఫ్ డీ ఐ విధానంలో మార్పుల‌ను గురించి ప్ర‌క‌టిస్తూ, బీమా మ‌రియు పింఛ‌న్లు, అసెట్ రీ క‌న‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు, స్టాక్ ఎక్చేంజీల రంగాల‌కు సంబంధించి ఎఫ్ డీ ఐ విధానంలో సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌తిపాదిస్తున్నాం అన్నారు. భార‌త దేశంలో ఉత్ప‌త్తి చేసిన‌, త‌యారు చేసిన ఆహార ఉత్ప‌త్తుల విక్ర‌యంలో ఎఫ్ ఐ పీ బీ మార్గం గుండా వంద శాతం ఎఫ్ డీ ఐ కి అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రుగుతుందని తెలిపారు. ఇది రైతుల‌కు ల‌బ్ది చేకూర్చ‌డంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌కు ఉత్తేజాన్ని అందివ్వ‌గ‌ల‌ద‌ని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించ‌గ‌ల‌ద‌ని వివ‌రించారు.

కీల‌క‌మైన ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆమోదించిన‌ట్లు, వీటిని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. కొత్త ప్రాజెక్టులకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను స‌మీక‌రించ‌డం కోసం CPSE ల ఇండివిడ్యువ‌ల్ యూనిట్ల‌లో ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకునే వీలుందన్నారు.

CPSE లను వాటి అధీనంలోని భూమి, త‌యారీ విభాగాలు వ‌గైరా ఇండివిడ్యువ‌ల్ అసెట్స్‌ను విక్ర‌యించేట‌ట్లు ప్రోత్స‌హిస్తామ‌ని తెలిపారు. ఏఏ CPSE లలో ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల‌ను వ్యూహాత్మ‌కంగా విక్ర‌యించాలో నీతి ఆయోగ్ ఎంపిక చేస్తుంద‌ని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*