Home » BUSINESS » పెట్రోల్ బంకుల్లో చ‌మురు సంస్థ‌ల అధికారుల ఆక‌స్మిక త‌నిఖీ

పెట్రోల్ బంకుల్లో చ‌మురు సంస్థ‌ల అధికారుల ఆక‌స్మిక త‌నిఖీ

హైద‌రాబాద్, మార్చి 15, 2016: హైద‌రాబాద్ లోని చ‌మురు సంస్థ‌ల రిటైల్ అవుట్‌లెట్ ల‌లో (పెట్రోల్ బంకుల్లో) చ‌మురు సంస్థ‌ల అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు ఈ త‌నిఖీలు కొన‌సాగాయి.

ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌,హిందుస్థాన్ పెట్రోలియం, భార‌త్ పెట్రోలియంకు చెందిన మొత్తం 24 రిటైల్ అవుట్ లెట్ల‌లో నాణ్యత, పరిమాణాలకు సంబంధించి ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు తెలంగాణ‌లో చ‌మురు సంస్థ‌ల రాష్ట్ర స్థాయి స‌మ‌న్వ‌య క‌ర్త సీహెచ్‌. శ్రీ‌నివాస్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఇటీవ‌ల రిటైల్ అవుట్ లెట్ల‌పై రాష్ట్ర తూనిక‌లు, కొల‌త‌ల శాఖ‌,పౌర స‌ర‌ఫ‌రాల విభాగాలు చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు కొన‌సాగింపుగా తాము కూడా సంయుక్త త‌నిఖీ చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. “ పెట్రోల్ బంకుల్లో మార్కెటింగ్ మార్గ‌ద‌ర్శ‌కాలు-2013 “ కు లోబ‌డి నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించాల‌ని ఆయ‌న సూచించారు.

చ‌మురు సంస్థ‌ల‌కు చెందిన రిటైల్ అవుట్ లెట్ల‌లో పెట్రోల్ నాణ్య‌త‌,ప‌రిమాణాన్ని తెలుసుకునే హ‌క్కు ప్ర‌తి వినియోగ‌దారుడికి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తూనిక‌లు, కొల‌త‌ల శాఖ స్టాంప్ తో కూడిన 5 లీట‌ర్ల గ‌రాటు కూడా ప్ర‌తి అవుట్ లెట్ లోనూ ఉంటుంద‌న్నారు. తూకంపై ఎవ‌రికైనా అనుమానాలు వ‌స్తే ప‌రీక్షించుకోవ‌చ్చ‌ని సూచించారు.

పెట్రోల్ నాణ్య‌త‌ను వాట్‌మ‌న్ ఫిల్ట‌ర్ II పేప‌ర్ తో చూడొచ్చ‌న్నారు. రిటైల్ అవుట్ లెట్ల‌లో అందుతున్న సేవ‌ల ప‌ట్ల వినియోగ‌దారులు సంతృప్తి చెంద‌ని ప‌క్షంలో సేల్స్ అధికారుల‌కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.

ఐవోసీఎల్‌కు సంబంధించిన ఫిర్యాదుల‌పై 18002333555, హిందుస్థాన్ పెట్రోలియంకు సంబంధించిన ఫిర్యాదుల‌పై 18002333555, భార‌త్ పెట్రోలియంకు సంబంధించిన ఫిర్యాదుల‌పై 1800224344 టోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫోన్ చేసి, లేదా ఆయా కంపెనీల వెబ్ సైట్ల ను సందర్శించి ఫిర్యాదు చేయొచ్చ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*