Home » LIFE STYLE » కైలాస్ మాన‌స స‌రోవ‌ర్ 2016 యాత్రకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కైలాస్ మాన‌స స‌రోవ‌ర్ 2016 యాత్రకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కైలాస్ మాన‌స స‌రోవ‌ర్యాత్ర – 2016 కోసం ఆన్‌లైన్లో  ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని  కేంద్ర విదేశాంగ శాఖ ఈరోజు ప్ర‌క‌టించింది.  http://kmy.gov.in వెబ్‌సైట్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నిసూచించింది.  ఈ ఏడాది జూన్ 2 నుంచి సెప్టెంబ‌ర్9వ తేదీ వ‌ర‌కు ఈయాత్ర జ‌రుగ‌నుంది.  లిపులేఖ్ మార్గం, నాథుల్లా మార్గంగుండా యాత్ర సాగ‌నుంది.

లిపులేఖ్ (ఉత్త‌రాఖండ్‌)మార్గంలో 200 కిలో మీట‌ర్లమేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.  దీనికిప్ర‌తి ఒక్క‌రికి 1.6 ల‌క్ష‌లు ఖ‌ర్చవుతాయి.  ఈ మార్గం గుండా 18 బృందాలుగా (ఒక్కో బృందంలో 60 మంది యాత్రికులుఉంటారు) తీసుకెళ‌తారు.  సిక్కింలోని నాథుల్లామార్గం గుండా వాహ‌నంలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.

ఈ మార్గంలో వెళ్ళ‌డానికి ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల వ్య‌యం కానుంది.  మొత్తం 7 బృందాలుగా (ఒక్కో బృందంలో 50 మంది యాత్రికులుఉంటారు) యాత్రికుల‌ను తీసుకెళ‌తారు.  18 నుంచి 70 ఏళ్ళ లోపు వారుకైలాస్ మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  నాథుల్లా మార్గం గుండా ప్ర‌యాణానికి వ‌యో వృద్ధులు, మొద‌టిసారి ద‌ర‌ఖాస్తుచేసుకున్న‌వారికి, వైద్యుల‌కుప్రాధాన్యం ఇస్తారు.

ఈ యాత్ర కోసం ప్ర‌యాణికులఎంపిక‌ను నిష్ప‌క్ష‌పాతంగా,పూర్తి పార‌ద్శ‌కంగాచేప‌డ‌తారు.  కంప్యూట‌ర్ జ‌న‌రేట‌ర్ ప‌ద్ధ‌తిలోఎంపిక ఉంటుంది.  ద‌ర‌ఖాస్తుదారులు 011-24300655 ఐ.వీ.ఆర్.ఎస్హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు ఫోన్ చేసి స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*