Home » BUSINESS » ఉద్యోగభ‌విష్య నిధి (EPF) సంస్థ అధికారుల‌తో కేంద్ర మంత్రి స‌మావేశం

ఉద్యోగభ‌విష్య నిధి (EPF) సంస్థ అధికారుల‌తో కేంద్ర మంత్రి స‌మావేశం

కేంద్ర కార్మిక‌, ఉపాథి క‌ల్పన శాఖ మంత్రి శ్రీ బండారు ద‌త్తాత్రేయశుక్ర‌వారం బ‌ర్క‌త్‌పురా లోని ఉద్యోగ భ‌విష్య నిధి (ఈ.పి.ఎఫ్.ఓ) సంస్థ ప్ర‌ధానకార్యాల‌యంలో ఈ.పి.ఎఫ్.ఓ అధికారుల‌తో స‌మీక్షా స‌మ‌వేశం నిర్వ‌హించారు.  అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ- తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కార్మికులసంక్షేమం కొర‌కు ఈ.పి.ఎఫ్.ఓ అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని వివ‌రించారు.

మొత్తం తెలంగాణరాష్ట్రంలో 29,269 సంస్థ‌లు వుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో22,706 సంస్థ‌లు ఈ.పి.ఎఫ్.ఓ రికార్డుల ప్ర‌కారంఉన్నాయి.  మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోసుమారు 36 ల‌క్ష‌ల మంది, పిఎఫ్ చందాదారులు వుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో13 ల‌క్ష‌ల మంది చందాదారులుఉన్నారు.  భ‌విష్య‌నిధి కార్య‌క‌లాపాల్లోపూర్తి పార‌ద‌ర్శ‌క‌త కోసం ప్ర‌వేశ‌పెట్టిన వివిధ చ‌ర్య‌ల‌ను మంత్రి వివ‌రిస్తూ -శ్ర‌మ సువిధ పోర్ట‌ల్ ద్వారా కార్మికులకు ప్ర‌యోజ‌న‌కారిగా యూనివ‌ర్స‌ల్ అకౌంట్నెంబ‌ర్ రూపొందించామ‌ని తెలిపారు.  అలాగే, కార్మిక గుర్తింపు సంఖ్య‌తో ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాల‌ను అనుసంధానంచేయ‌డం వ‌ల్ల కార్మికులు పొందే లాభాల‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జ‌మ చేయ‌వ‌చ్చ‌నిమంత్రి వివ‌రించారు.

పూర్తిగా ఆన్‌లైన్ప‌ద్ధ‌తిలో సంస్థ‌ల పీఎఫ్ లావాదేవీల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు, ఆయా సంస్థ‌ల‌ను ప‌ర్య‌వేక్షించేఅధికారులు 72 గంటల్లోపు త‌మ నివేదిక‌ను ఆన్‌లైన్‌లోపొందుప‌రుస్తార‌ని మంత్రి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం కార్మికుల సంక్షేమం కోసం చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి వివ‌రిస్తూ- మొట్ట‌ మొద‌టిసారిగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో బోన‌స్ ప‌రిమితినిపెంచామ‌ని, క‌నీస పింఛ‌న్‌ను 1000 రూపాయ‌లుగా చేశామ‌ని మంత్రి తెలిపారు.

నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, సిద్ధిపేట ప్రాంతాల్లో కార్మికుల కోసంమోడ‌ల్ హౌసింగ్ కాల‌నీని రాష్ట్ర ప్ర‌భుత్వం స్థ‌లం అందిస్తే నిర్మిస్తామ‌నిమంత్రి అన్నారు.  అలాగే,హైద‌రాబాద్‌లో ఉప్ప‌ల్‌, ఎల్‌.బి.న‌గ‌ర్ లో ఈ.పీ.ఎఫ్.ఓ  కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.  అలాగే, రాజ‌మండ్రి,క‌ర్నూలు ప్రాంతాల్లో ఉన్న ఈ.పీ.ఎఫ్.ఓకు నూత‌న వ‌స‌తిని ఏర్పాటు చేయ‌నున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*